Samantha: గ్లో తగ్గిందంటూ కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత!
Samantha Strong Reply to Tweet on her Glow: మయోసైటిస్ తో బాధ పడుతున్నానని ప్రకటించి చాలా కాలం మీడియాకు దూరమైన సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో సమంత పాల్గొనడంతో ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇక ట్రైలర్ విడుదలయ్యాక అందులో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కు, నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక సోషల్ మీడియా పేజ్ చేసిన కామెంట్ మీద సమంత ఘాటూగా స్పందించింది. సమంతను చూస్తే జాలేస్తుంది, విడాకుల తర్వాత ధైర్యంగా నిలదొక్కుకొని కెరీర్ ఉన్నత స్థానంలో ఉందని భావిస్తుండగా మయోసైటిస్ ఆమెను దెబ్బతీసింది, ఆమెను మళ్లీ బలహీనురాలిని చేసింది అంటూ సదరు పేజ్ రాసుకొచ్చింది. సామ్ అందం, గ్లో తగ్గిపోయింది. ఆమెను చూస్తూ బాధేస్తోంది అంటూ ట్వీట్ చేయగా.. సమంత ఆ పేజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నాలా నెలల తరబడి ట్రీట్ మెంట్ తీసుకునే పరిస్థితి నీకు రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా అంటూ కర్ర విరగకుండా పాము చావకుండా అతను బాధ పడేలా సమంత రిప్లై ఇచ్చింది.