Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది
Shaakuntalam: సమంత నటించిన సినిమాలు ఈ మధ్య మంచి టాక్ ను తెచ్చుకుంటున్నాయి యూటర్న్, ఓ బేబి, వంటి సినిమాలు కమర్షియల్‌గానూ మంచి విజయాలు సాధించాయి. ఇక ఇటీవలే రిలీజైన ‘యశోద’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది.
గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంతుడి గా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్,అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రలలో కనిపించి అభిమానులను అలరించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను పెచ్చేసింది.
ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన ‘మల్లిక’ అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఫస్ట్ సింగిల్ ను వదలనున్నారు.