Samantha:క్రేజీ హీరోయిన్ సమంత గత ఏడాది తాను మయో సైటీస్తో బాధపడుతున్నానని వెల్లడించి షాక్ ఇచ్చారు. `యశోద` సినిమాకు డబ్బింగ్ చెబుతూ నవంబర్‌లో సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోని షేర్ చేసిన సమంత ఒక్కసారిగా అభిమానులుకు షాక్ ఇచ్చారు.
Samantha:క్రేజీ హీరోయిన్ సమంత గత ఏడాది తాను మయో సైటీస్తో బాధపడుతున్నానని వెల్లడించి షాక్ ఇచ్చారు. `యశోద` సినిమాకు డబ్బింగ్ చెబుతూ నవంబర్‌లో సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోని షేర్ చేసిన సమంత ఒక్కసారిగా అభిమానులుకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత `యశోద` సినిమా ప్రమోషన్స్ కోసం సుమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్ ఈ సందర్భంగా తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంన్నది వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అప్పటి నుంచి మయోసైటీస్కు సంబంధించిన పలు విషయాలని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ వచ్చింది. కొన్నాళ్ల పాటు ఆయుర్వేదం ట్రీట్మెంట్ని తీసుకున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పూర్తి స్థాయిలో దీని నుంచి బయటపడటానికి త్వరలో అమెరికా వెళ్లబోతున్నారు. అక్కడే రెండు నెలల పాటు చికిత్స తీసుకోనున్నారు. ఇందు కోసం తాను అంగీకరించిన సినిమాల షూటింగ్‌లని పూర్తి చేసిన సామ్ తదుపరి సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్లని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారట.
Samantha Is Brand Ambassador Of Myositis
ట్రీటమ్మెంట్ కోసం రెండు నెలలు యుఎస్‌లో ఉండనున్న సమంత ఇప్పుడు తాను ఎదుర్కొంటున్న `మమయోసైటీస్`పై అందరిలో అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. మయోసైటీస్పై దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న `మైసిటీస్ ఇండియా`కు సామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఈ విషయాన్ని సదరు సంస్థ ప్రత్యేకంగా ప్రకటించింది. మయోసైటీస్పై అవగాహన కల్పించేందుకు, ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయడానికి మాతో కలిసి ప్రయాణించడానికి సమంత ముందుకు వచ్చారని ప్రకటిస్తున్నందుకు థ్రిల్ అవుతున్నాం` అని ప్రకటించారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యుఎస్‌లో రెండు నెలల పాటు ట్రీటమ్మెంట్ తీసుకోనున్న సామ్‌కు అండగా ఆమె తల్లి ఉంటుందని తెలిసింది. ఇదిలా ఉంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ `ఖుషీ` సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రానుంది. `లైగర్` ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ, `శాకుంతలం` షాక్‌తో సమంత తీవ్ర నిరాశకు గురయ్యారు. `ఖుషీ` మూవీతో మళ్లీ సక్సెస్ బాట పడతామనే గట్టి నమ్మకంతో ఉన్నారు.