Samantha Injured: షూట్ లో సమంతకు గాయాలు?
Samantha Injured: సమంత ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం వాటిలోని పాత్రల కోసం తగినట్టుగా మారుతోంది. అందుకే హెవీ వర్కౌట్లు చేస్తోందని అంటున్నారు. ఇక ఆమె ఇప్పుడు నైనిటాల్‌లో రాజ్ అండ్ డీకే సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ లో ఉంది. దీనికి గాప్ దొరికినా శివ నిర్వాణ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టుల కోసమే హెవీ వర్కౌట్లు చేస్తోందని తెలుస్తోంది. ఆ సిరీస్ లోని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రిహార్సల్స్ చేస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత చేతికి గాయాలయ్యాయి, సమంత చేయి, వేళ్లు అంతా కూడా కమిలిపోయి రక్తం కారుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ ఆధ్వర్యంలో ఈ రిహార్సల్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు. సమంత తన చేతి పరిస్థితిని చెబుతూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టగా ఆ పోస్టుకు ట్రైనర్ జునైద్ రిప్లై ఇచ్చాడు, వీటిని కొందరు గాయాలని అంటారు కానీ అవి మనకు ఆభరణాలు అని కామెంట్ పెట్టాడు. దీంతో జునైద్ మాటలకు సమంత దండం పెడుతూ కామెంట్ చేసింది. యోధుడికి గాయాలే ఆభరణాలు అనే నానుడిని సమంతకు అన్వయించాడు జునైద్.