Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ `సలార్`లో నటిస్తున్నారు. `కేజీఎఫ్` సిరీస్ సినిమాల తరహాలోనే ఈ మూవీని కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్‌ని `సలార్:పార్ట్ 1 సీజర్ ఫైర్` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ `సలార్`లో నటిస్తున్నారు. `కేజీఎఫ్` సిరీస్ సినిమాల తరహాలోనే ఈ మూవీని కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్‌ని `సలార్:పార్ట్ 1 సీజర్ ఫైర్` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ప్రభాస్‌ని నీల్ ఎలా చూపించి ఉంటాడో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
దీంతో ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, మధు స్వామి, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, కేజీఎఫ్ గరుడు రామచంద్రరాజు, శ్రియారెడ్డి తదితరులు నటిస్తున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందిస్తుండగా అదే సినిమాకు పని చేసిన భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. `కేజీఎఫ్ 2`కు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఉజ్వల్ కులకర్ణి `సలార్`కు ఎడిటర్‌గా పని చేస్తున్నాడు.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని సెప్టెంబర్ 28న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. రీసెంట్గా విడుదల చేసిన టీజర్ విడుదలైన గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబట్టి సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ప్రభాస్ ఫేస్‌ని చూపించకుండా, అతనితో ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండా విడుదల చేసిన టీజర్ యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా రికార్డు సృష్టించింది.
సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పై పడింది. దీంతో అభిమానులు నెట్టింట `సలార్` ట్రైరల్ హ్యాష్ ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. ట్రైలర్‌ని వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 6న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు ట్రైలర్‌తో పాటు మరో బిగ్ సర్ ప్రైజ్ కూడా రానుందని తెలుస్తోంది. అంటే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ లిరికల్ వీడియో ప్రోమోని కూడా అదే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచాం జరుగుతోంది. ఒకే రోజు రెండు సర్ ప్రైజ్‌లు రానుండటంతో అభిమానులు ఇప్పటి నుంచే సంబరాలు మొదలు పెట్టారు.
దీనికి తోడు ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీమియర్స్ కోసం రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ `సలార్` ప్రీమియర్స్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ స్థాయిలో ఏ సినిమాకు జరగని రీతిలో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతుండటంతో `సలార్` తొలి రోజు ఓపెనింగ్స్ పరంగా సరికొత్త రికార్డ్‌ను నమోదు చేయడం ఖాయం అని తెలుస్తోంది.