SaiPallvi: డాక్టర్ గా స్థిరపడతా ..యాక్టర్ గా అలరిస్తా..సాయి పల్లవి
SaiPallvi: అతి తక్కువ సమయంలోనే.. తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సాయి పల్లవి. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా.. కథకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. కథలో బలం ఉంటె చాలు ఆ సినిమా కి కరెక్ట్ గా యాప్ట్ ఐయ్యే హీరోయిన్ లలో సాయి పల్లవి ముందంజలో ఉంటుంది.
తాజాగా సాయిపల్లవికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.గతేడాది ఏడాదిలో విరాటపర్వం , గార్గి సినిమాలతో అలరించిన సాయిపల్లవి గత కొంత కాలంగా ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదు. దీంతో నటనకు గుడ్ బై చెప్పబోతుంది.. అంటూ సోషల్ మీడియా లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. సాయిపల్లవి మెడిసిన్ చదివిందని అందరికి తెలిసిందే. సాయిపల్లవి త్వరలోనే యాక్టింగ్‌కు బై చెప్పి వైద్యరంగంలో తన సేవలు కొనసాగించాలనుకుంటోందని.. ఓ ఆస్పత్రిని కూడా నిర్మించే ఆలోచనలో కూడా ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఆమె రూమర్స్‌కు చెక్ పెట్టింది. డాక్టర్ చదివినా.. నటిని కావాలనుకున్నానని చెప్పింది. మంచి కథలుంటే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ తన సినిమాల గురించి వస్తున్న రూమర్స్‌ను కొట్టిపారేసింది సాయిపల్లవి. దీంతో సాయి పల్లవి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.