Gargi Movie on SonyLiv: గార్గీ ఓటీటీ హక్కులు దక్కించుకున్న సోనీ సంస్థ, స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే క్లారిటీ
సాయి పల్లవి హీరోయిన్గా గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించిన చిత్రం గార్గి. ఈ చిత్రం జులై 15న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.నెమ్మదిగా ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ పెరుగుతుంది. దీంతో ఈ సినిమా ఓటిటి విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయి పల్లవి అభిమానులు, సినీ లవర్స్ అంత కూడా గార్గి డిజిటల్ రిలీజ్‌పై ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గార్గి ఓటిటి రిలీజ్‌పై ఒక క్లారిటీ వచ్చేసింది.
స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే క్లారిటీ
గార్గి చిత్రం యొక్క డిజిటల్ హక్కులను SonyLiv కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఆగస్టు 12 2022న SonyLivలో విడుదల అవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైనా కారణాలతో డేట్ ముందుకు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా లీకులు వస్తున్నాయి. అయితే గార్గి O.T.T విడుదల తేదీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ వీకెండ్ థియేటర్స్ లో రెస్పాన్స్ బట్టి ఓటిటి డేట్‌ని అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Sony ప్రతినిదులు చెప్తున్న మాట. అయితే గార్గి శాటిలైట్ రిలీజ్ మాత్రం 2022 సెప్టెంబర్ నెలలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం O.T.T విడుదల తేదీ తర్వాత శాటిలైట్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ మేరకు కలర్స్ టీవీ మేకర్స్ తో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే టీవీ హక్కుల ఒప్పందం గురించి అధికారిక సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
చిన్నారులపై లైంగిక దాడుల అంశంతో తెరకెక్కిన సినిమా
ఇక గార్గిలో సాయి పల్లవి నటనకి, దర్శకుడి ప్రతిభకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చిన్నారులపై లైంగిక దాడుల అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. లైంగిక దాడికి గురైన పసిపాప పరిస్థితి ఎలా ఉంటుంది. కేసులో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో పాప కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ కేసులో సాయి పల్లవి ఎలా పోరాడుతుందో తెలిపే అద్భుత కోర్టు సీన్ డ్రామాతో గార్గిని చిత్రీకరించారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రని కాపాడే కూతురిగా సాయిపల్లవి ఎప్పటిలానే అత్యద్భుత నటనని కనపరిచింది. కేవలం సాయిపల్లవి కోసమే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు.