ప్రమాదం తరువాత మొదటిసారి సెట్ లో అడుగుపెట్టిన మెగా హీరో.. వీడియో వైరల్
మెగా మేనల్లుడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సుప్రీం హీరో ఎట్టకేలకు మళ్లీ సెట్స్ లో కాలు పెట్టాడు. ప్రస్తుతం సాయి తేజ్, కార్తీక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు షూటింగ్ ని మొదలుపెట్టింది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సెట్స్ లో సాయి తేజ్ నేడు అడుగుపెట్టాడు. అక్కడ అతడికి ఘనస్వాగతం పలికారు. వెల్ కమ్ బ్యాక్ సాయి తేజ్ అంటూ చిత్ర యూనిట్ సాయి తేజ్ ని ఆహ్వానించింది. వారి అభిమానాన్ని చూసి సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు. మీ అందరి అభిమానానికి లెక్కలేనన్ని ధన్యవాదాలు చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.