Rajamouli: రాజమౌళితో కలిసి సినిమా చేస్తాం హాలీవుడ్ మేకర్స్
Russo Brothers want to produce SS Rajamouli film: తెలుగు సినిమా సత్త ఏంటో నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయ్ అందులోను రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ,ఆర్ఆర్ఆర్ సినిమాలది ప్రత్యేక స్థానం అని చెప్పాలి. తెలుగు సినిమానే కాకుండా ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో మరో లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి తెలుగు లో ఈయన తీసిన చిత్రాలు తక్కువే అయిన సాధించిన విజయాలు ఎక్కువ అని చెప్పాలి.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ తో రాజమౌళి హవా నడుస్తుంది. ఈ దర్శకుడి పేరు ప్రపంచ వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది.లేటెస్ట్ గా ‘ఆర్ ఆఆర్’ సినిమాతో ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ను కూడా తనవైపు తిప్పుకున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక రీసెంట్ గా అయితే వరల్డ్ బాక్సాఫీస్ హిట్ చిత్రం “అవెంజర్స్” సిరీస్ దర్శకులు రూసో బ్రదర్స్ రాజమౌళిపై కొన్ని కామెంట్స్ చేశారు.
రాజమౌళితో కలిసి ఓ సినిమా చెయ్యాలి అనుకుంటున్నామని తెలిపారు. ది గ్రే మాన్ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రూసో బ్రదర్స్ ఇండియా కి వచ్చి ప్రమోషన్స్లలో పాల్గొన్నాక రాజమౌళి ని కలుసుకున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరిగిందని సమాచారం. అయితే రాజమౌళిని కలవడంపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రాజమౌళిని తాము కలవడం ఎంతో గౌరవప్రదంగా ఫీల్ అవుతున్నామని అంతేకాకుండా ది గ్రేట్ రాజమౌళి అంటూ సంబోధించారు.
దీంతో ఇండియన్ సినిమా ప్రేక్షకులు రాజమౌళి కి మరింత గౌరవం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అతి తొందర్లోనే ఈ దర్శకుడు హాలీవుడ్ లో మెగాఫోన్ పట్టబోతున్నాడన్నమాట.
Such an honor getting to meet THE great S.S. Rajamouli… https://t.co/TXly90zGt3
— Russo Brothers (@Russo_Brothers) July 29, 2022