RRR: హైదరాబాద్ చేరుకున్న రాజమౌళి, కీరవాణి
RRR: డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా చితం ‘ఆర్ఆర్ఆర్’..ఇండియన్ సినిమా స్టామినా ఏంటో తెలియచెప్పిన ఈ చిత్రం వరుస అవార్డులను సొంతం చేసుకుంటుంది. మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1100కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నామినేట్ కాగా… అవార్డు గెలుపొందింది. లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ‘ఆర్ఆర్ఆర్’ టీం హాజరై ఈ అవార్డును అందుకున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి సహా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి దేశం తరపున అభినందనలు వెల్లువెత్తాయి.
ఇక ఈ అవార్డు ఫంక్షన్లో రాజమౌళి ఇతర హాలీవుడ్ దర్శకులను కలిసి తన సినీఅనుభవాలను పంచుకున్నాడు. అలాగే ప్రపంచ దర్శక దిగ్గజం స్పిల్ బర్గ్ తో కలిసి కాసేపు ముచ్చటించారు. ఇక ఈ అవార్డును అనుకున్నతర్వాత రాజమౌళి, కీరవాణి మొదటి సరిగా హైదరాబాద్ కి వచ్చారు. వారికీ ఘనస్వాగతం పలికారు. అక్కడే మీడియా తో మాట్లాడిన రాజమౌళి అవార్డును అందుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నారు.అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు.