ఆర్ఆర్ఆర్ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల్లో 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదలైన 2 నెలల తర్వాత మే 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 మరియు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశాయి. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో జీ5 లో విడుదల అవుతుండగా, హిందీ లో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.