RRR: రికార్డులు బద్దలు కొట్టిన ఫస్ట్ డే కలెక్షన్స్
వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు RRR మేనియా నెలకొంది. టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య సుమారు 450 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయంలో అనేక చోట్ల ఆల్ టైం రికార్డులు సృష్టించింది. అమెరికాలో ప్రిమియర్స్ తో పాటు తొలిరోజు కలెక్షన్లు 5 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసింది. దీనితో బాహుబలి 2 (4.59 మిలియన్లు)ని బ్రేక్ చేసింది. ఇక ఏపీ తెలంగాణలో ఒక్కరోజే రూ. 74 కోట్లు రాబట్టింది. ఏపీ తెలంగాణలో RRR కలెక్షన్స్ ఇలా ఉన్నాయ్. నిజాం: 23.35Cr , సీడెడ్ : 17 Cr , ఉత్తరాంధ్ర: 7.42Cr , ఈస్ట్: 5.39Cr , వెస్ట్: 5.93Cr, గుంటూరు: 7.80Cr , కృష్ణా: 4.21Cr , నెల్లూరు: 3.01Cr. అలా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల టోటల్ 74.11కోట్లు షేర్ వసూళ్లు సాధించింది. ఇప్పటికి ఇదే అల్ టైం రికార్డు కావడం విశేషం.