Madhavan:ఓటీటీలో విడుదల అవుతున్న ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’
Rocketry The Nambi Effect Movie OTT : లవ్ స్టోరీస్ చిత్రాలతో దక్షిణాదిన లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మాధవన్. హీరోగా కెరీర్ ముగిసిపోవడంతో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా ప్రతిభను చాటుకుంటున్నారు. తెలుగులో ఆ మధ్య వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రంలో విలన్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మధ్య మాధవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్.
ప్రముఖ సైంటిస్టు నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్. మాధవన్ హీరోగా నటించిన ఈ సినిమా జులై 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన రహస్యాలను శత్రువులకు చేరవేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్న నంబి నారాయన్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన మాధవన్.. దర్శకుడిగా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ చిత్రం కమర్షియల్గా పెద్దగా వసూళ్లను సాధించలేకపోయింది.కానీ సినిమా మౌత్ టాక్ మాత్రం అదిరిపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు యూనిట్ సభ్యులు. జులై 26 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రకటించింది. జులై 26న ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోందని స్పష్టం చేసింది.
hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD
— amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022