Konda Movie :ఆర్జీవి ‘కొండా’ మూవీ ఎలా ఉందంటే..?
Konda Movie Review: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని అందరికి తెలుసు.ఆయన సినిమాలన్నీ వివాదలచుట్టూ తిరుగుతుంటాయి. ఈ మధ్య బయోపిక్ లమీద పడ్డాడు ఆర్జీవి. రక్తచరిత్ర సినిమా పరిటాల రవి జీవిత చరిత్ర అయితే ‘వంగవీటి’ సినిమా వంగవీటి మోహనరంగా జీవితం పై తెరకెక్కింది.ఆ తర్వాత ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ అని ఎన్టీఆర్ రాజకీయాలోకి వచ్చాక ఆయన రాజకీయ చరిత్రని తెరపై ఆవిష్కరించాడు ఇప్పుడు తెలంగాణలోని రాజకీయనాయకులు కొండా దంపతులంటే అందరికి తెలుసు వారిపై తాజాగా ‘కొండా’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఏదోఒక సందర్భంలో సాధారణ వ్యక్తి అసాధారణ శక్తి గా మారతాడు ఈ చిత్రం కూడా అలాంటిదే. ‘కొండా’ కథ…. 1990 నాటి తెలంగాణా నేపథ్యంలో సాగుతుంది. కొండా మురళి కాలేజీ విద్యార్థి… లైబ్రరీలో పుస్తకాలు చదివి భారత రాజ్యాంగానికి ఆకర్షితుడవుతాడు అదే సమయంలో నగరంలో రాజకీయ యుద్ధాలు జరుగుతుంటాయి.అలాంటి పరిస్థితుల్లో కొండా జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది.ఈ క్రమంలో కొండా సురేఖ పరిచయంతో పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఆ తర్వాత కొండా మురళి ఎందుకు నేరస్థుడు అయ్యాడు? ఏ పరిస్థితులు అతన్ని నేరస్థుడిని చేశాయి? ఒక నేరస్థుడు రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు? అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
బయోపిక్ లను తీయడంలో వాస్తవాలను తెరపై చూపించడంలో ఆర్జీవి స్టైల్ వేరు. ఈ సినిమా ప్రారంభమే ఆర్జీవి వాయిస్ తో మొదలవుతుంది.సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఆర్జీవి వాయిస్ తోనే ఒక క్రురియాసిటి మోదవుతుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని 1990 కాలానికి తీసుకెళ్తాడు. ముఖ్యంగా కొండా మురళి ఎలా నేరస్తుడు అయ్యాడో చూపించిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. కొండా సురేఖ పాత్రను చక్కగా డిజైన్ చేసిన వర్మ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ గా సురేఖ పాత్రను చూపించాడు అనడంలో అతిశయోక్తి లేదు.ఇక సెకండాఫ్ లో రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు తనశత్రువులను ఎదుర్కొనే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి.
కొండా సినిమాను ఒకవైపే చూపించడం వల్ల కొంత వాస్తవికతను వర్మ చూపించలేకపోయాడు అని అర్ధమవుతుంది. 1990 లో రాజకీయాలు అప్పుడప్పుడే వేడెక్కుతున్నాయి అందులో ఒక కొండా పాత్రను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఒకవైపు కోణాన్ని మాత్రమే తెరపై చూపించాడు.శాండీ అద్డంకి అందించిన బాగ్గ్రౌండ్ మ్యూజిక్ అందరిని అలరించేలా ఉంది.సురేష్ సారంగ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్.
ఇక నటి నటుల విషయంలో కొండా పాత్రలో త్రిగున్ చక్కగా నటించాడు. యాక్షన్ సన్నివేషాలో ఒక్కోసారి జీవించేసాడనే చెప్పాలి.అలాగే కొండా సురేఖ పాత్రలో ఇర్రా మోర్ మెప్పించింది.పృధ్వీ రాజ్, ఎల్.బి. శ్రీరామ్, పార్వతి అరుణ్, ప్రశాంత్ కార్తీ, తులసి ఇలా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.మొత్తంగా చూస్తే ఆర్జీవీ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగానే నచ్చుతుంది.
ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చాల రోజుల తర్వాత తెలంగాణలో అత్యంత పాపులర్ పొలిటీషియన్స్ అయిన కొండా దంపతులు అంటే అందరికి తెలుసు.వారి జీవితాలపై తెరకెక్కిన ఈ బయోపిక్ ను చూసిన ప్రేక్షకులు చాల బాగుందంటూ కొండా మురళి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రంలో నక్సలైట్ ఆర్కె పాత్ర నటించిన ప్రశాంత్ కార్తీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఆయన పాత్ర ఏంటన్నది ఈ చిత్రం లో చూపించినందుకు ఆర్జీవి కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.