RaviTeja: ఓటీటీ లో భారీ ధర పలికిన ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ?
RaviTeja Ramarao on Duty: శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ చిత్రం సుధాకర్ చెరుకూరి,ఆర్ టి వర్క్స్ లో తెరకెక్కింది. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా…ఈ సినిమాతో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇచ్చాడు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంటుంది. 1995 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రవితేజ ఎమ్మార్వో రామారావు గా ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందట. అందుకు గానూ.. సదరు సంస్థ రూ. 12 కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈమద్యే నిర్మాతమండలి లో నిర్ణయం తీసుకున్నట్లు ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి ఇవ్వనున్నారని సమాచారం.. లేక నెల రోజులకు ముందే స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.