RaviTeja: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
Rama Rao On Duty Movie Review: మాస్ మహారాజా లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఎట్టకేలకు ప్రేక్షకులముందుకు వచ్చింది. ఎప్పుడో విడుదలకావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి రవితేజ కొంచెం కొత్తగా ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.ఎన్నడూ చేయని పాత్రను చేయడం వల్ల అంచనాలు పెట్టుకుని థియేటర్లలోకి వచ్చింది మరి రామారావు కరెక్ట్ గా డ్యూటీ చేశాడా లేడా? ఇప్పుడు చూద్దాం.
కథ
1995 సంవత్సరంలో రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఈ చిత్రం ప్రారంభమవుతుంది. రామారావు (రవితేజ) సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. న్యాయానికి లోబడి తన విధులను నిర్వర్తిస్తుంటాడు. అనుకోని కారణాల రీత్యా.. రామారావు కలెక్టర్ పదవిని కోల్పోతాడు.. ఆ తర్వాత చిత్తూరులోని హర్స్‌లీ హిల్స్‌కు ఎమ్మార్వోగా బదిలీ అవుతాడు.. ఈ క్రమంలోనే రామారావు మాజీ ప్రేయసి మాలిని (రజిషా విజయన్) భర్త మిస్ అవుతాడు. అతన్ని వెతికే క్రమంలో రామారావుకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఈ మిస్సింగ్ కేసు వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో రామారావు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది స్టోరీ..
ఇక ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు దర్శకుడు. పైగా ఇతను సిమాటోగ్రఫర్గా పనిచేసిన అనుభవం ఉంది.. ఆ కోణంలో ది బెస్ట్ ఫొటోగ్రఫీ ఈ సినిమాలో చూడొచ్చు. రామారావు ఆన్ డ్యూటీ కోసం ఎంచుకున్న కథ బాగుంది.వాస్తవానికి ఇది రవితేజకు కొత్త ప్రయత్నమని చెప్పాలి. ఎప్పుడూ మాస్ మసాలా కమర్షియల్, కామెడీతో సందడి చేసే రవితేజలో కొత్త కోణాన్ని చూపించాడు దర్శకుడు.
హనుమాన్ జంక్షన్ వంటి అద్భుతమైన కామెడీ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ మురళి పాత్రకి న్యాయం చేసాడు ఇక ఈ సినిమాతో వేణు మళ్ళీ బిజీ కాబోతున్నాడని చెప్పాలి.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. సీరియస్ గా నడుస్తున్న స్టోరీ మధ్యలో సాంగ్స్ ఎందుకువస్తున్నాయో అర్ధం కాదు. స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. మలయాళీ నటి రజిషా విజయన్ తన పాత్రకు తగినంతగా ఉన్న స్కోప్ మరో నటి దివ్యషా కౌశిక్ పెద్దగా స్కోప్ ఇవ్వలేదనే చెప్పాలి.
ఈ చిత్రాన్ని రొటీన్ యాక్షన్ డ్రామా లా సాగదీసాడు. సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. రవితేజ లోని సరికొత్త కోణాన్ని ఇష్టపడేవాళ్లు వెళ్లి చూడొచ్చు.