Ravi teja: మాస్ మహారాజా ట్రైలర్ విడుదల
Rama Rao On Duty trailer released: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించాడు. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్లుగానటిస్తున్నారు.వేణు తొట్టెంపూడి ఈ సినిమాద్వారా రి ఎంట్రీ ఇస్తున్నాడు.
షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం జులై 29న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ను రిలీజ్ చేసారు యూనిట్.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రవితేజకు తగినట్లు మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఈ సినిమాలో జోడించినట్లు ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది. ఇన్నాళ్లు గవర్నమెంట్ ఆఫీసర్గా డ్యూటీ చేశాను.. ఇప్పటి నుంచి రామారావుగా డ్యూటీ చేస్తాను” అని రవితేజ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇద్దరు హీరోయిన్లతో రవితేజ లవ్ ట్రాక్, ఫైట్స్, విజువల్స్,వంటి అంశాలు ఆకట్టుకున్నాయి.
ఇక వీటితో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు,రావణాసుర,మెగాస్టార్ 154వ చిత్రంలో నటిస్తున్నాడు.