Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ నుంచి మాస్ మహారాజ వచ్చేది .. అప్పుడే
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి భారీ అంచనాలు ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమౌతున్నారు. దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై బజ్ పెంచాయి. ఫస్ట్ సింగిల్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రేండింగ్ స్థాయి లో ఉంది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ అప్ డేట్ వచ్చింది. రవితేజ ఫస్ట్ లుక్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేయడానికి మేకర్స్ పవర్-ప్యాక్డ్ ప్రీ-లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ చేతిలో చిన్న మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపిస్తున్నాడు. ‘మాస్ ఈజ్ కమింగ్’ అని పోస్టర్ పై రాసుంది. రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది.ఈ లుక్ కోసం చిరంజీవి అభిమానులే కాకా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అప్పట్లో రవితేజ చిరంజీవి కలిసి అన్నయ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుంది.
అబ్బాయిలూ, మాస్ ట్రీట్ కి రెడీ అయిపోండి.🤘👍
Mass Maharaja @RaviTeja_offl's first look teaser from our #WaltairVeerayya releasing on 12th Dec, 11.07 AM 🔥🔥🔥
Stay tuned 🤩🤩#WaltairVeerayyaOnJan13th ✅ https://t.co/XuarZPu5dI
— Bobby (@dirbobby) December 9, 2022