Rashmika Mandanna: ‘సీతారామం’ చిత్రం నుండి రష్మిక మందన్న కొత్త పోస్టర్ రిలీజ్
Rashmika Mandana first look poster from Sita Ramam: సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ రష్మిక జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోలతో జోడీకడుతూ దూసుకెళ్తుంది. ప్రత్యేకంగా రష్మికా కోసం సినిమాచూసే అభిమానులున్నారంటే ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమవుతుంది.హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ‘సీతారామం’ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. బక్రీద్ ను పురస్కరించుకొని రష్మిక కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ కు ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.ఈ సినిమాలో ఆఫ్రీన్ అనే ముస్లిం యువతిగా రష్మిక మందన్న కనిపించబోతున్నది. ఇంతకుముందే ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా ముస్లిం యువతిగా రష్మిక నటించింది.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న విడుదల కానుంది.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
#EidMubarak from our Rebellious #Afreen, to you and your family…#SitaRamam@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 #EidAlAdha pic.twitter.com/OBAmERUSzN
— Dulquer Salmaan (@dulQuer) July 10, 2022