Ranveer Singh: విజయ్ దేవరకొండ ను చూసి షాక్ అయిన రణ్వీర్ సింగ్
Ranveer Singh Shocked To See Vijay Deverakonda In Chappals : సినిమాల్లో స్టైలిష్ గా కనిపించే విజయ్ బయట మాత్రం సింపుల్ గా ఉంటాడు. ఈయన రూటే సెపరేటు.. ముఖ్యంగా విజయ్ వేసుకునే డ్రెస్సులు అతని ఫ్యాన్స్‌ను బాగా ఆకర్షిస్తాయి. ఈవెంట్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ క్యాజువల్ లుక్‌లో కనిపించడానికి అతడు ఇష్టపడతాడు. తాజాగా లైగర్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు కూడా విజయ్ అలాగే వెళ్లాడు.
ఈ వేడుక హైదరాబాద్, ముంబైలలో జరిగింది. హిందీ ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లిన విజయ్ దేవరకొండ కార్గో ప్యాంట్, బ్లాక్ టీషర్ట్తోపాటు సాధారణ చెప్పులు వేసుకొని కనిపించాడు. ఇది చూసి ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన రణ్వీర్ సింగ్ షాక్ తిన్నాడు. లాంచ్ సందర్భంగా విజయ్ చెప్పులను చూసి రణ్వీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“విజయ్ కి నేను వెల్కమ్ చెప్పడమేంటి. అతడు మా హృదయాల్లో ఉన్నాడు. అసలు భాయ్ స్టైల్ చూడండి. అతన్ని చూస్తే నేను అతని ట్రైలర్ లాంచ్‌కు వచ్చానా లేక అతడే నా ట్రైలర్ లాంచ్‌కు వచ్చాడా తెలియడం లేదు” అని రణ్వీర్ అనడంతో అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వారు. జాన్ అబ్రహం తర్వాత ఇలా చెప్పులేసుకొని స్వాగ్ చూపిస్తున్న వ్యక్తివి నువ్వే.. నీ టీషర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే నాకు ఇచ్చెయ్.. కావాలంటే స్టేజ్ వెనక్కి వెళ్దాం పదా అంటూ విజయ్‌ని ఉద్దేశించి అన్నాడు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రణ్వీర్ మాత్రం తనదైన స్టైల్లో రెడీ అయి రాగా.. విజయ్ ఇలా సింపుల్‌గా కనిపించడం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ స్పోర్ట్స్ డ్రామా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.