కేజిఎఫ్ 2 పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం కెజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో సెలెబ్రిటీలు సైతం విషెష్ చెబుతున్నారు.. టీమ్ తాము పడిన కష్టానికి ఇంతటి రెస్పాన్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రానా దగ్గుబాటి ఈ సినిమాను వీక్షించి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు. ‘వైల్డ్.. వైల్డ్ మ్యాన్ మీరు మళ్ళీ అద్భుతం చేసారు.. యష్, ప్రశాంత్ నీల్ బాగా చేశారు.. కేజిఎఫ్ టీమ్ అందరికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే పప్రస్తుతం రానా.. నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు సిరీస్ చేస్తుండగా.. విరాట పర్వం విడుదలకు సిద్దమవుతుంది.
Wild wild men you’ll have done it again!! @TheNameIsYash @prashanth_neel well done 👏 huge Congratulations team #KGF 🔥🔥
— Rana Daggubati (@RanaDaggubati) April 17, 2022