సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. రమ్యకృష్ణ త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని, దీనికోసమే తన కో స్టార్..ఏపీ మినిస్టర్ అయిన రోజా ను కలిశారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి.
Ramya Krishna: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ(Ramya Krishna) రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు కొద్ది రోజులుగా నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. రమ్యకృష్ణ త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని, దీనికోసమే తన కో స్టార్..ఏపీ మినిస్టర్ అయిన రోజా(AP Minister Roja)ను కలిశారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రమ్యకృష్ణ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో తాను త్వరగా శ్రీవారి దర్శనం చేసుకున్నానంటే దానికి కారణం రోజానే అని చెప్పారు. దీంతో పాటు రోజా(Roja)ను చూసి చాలా రోజులు అవడం వల్లే తనను ఆ మధ్య కలిసినట్లు చెప్పారు. ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికే రోజా తన ఇంటికి ఆహ్వానించిందని రమ్యకృష్ణ(Ramya Krishna) అన్నారు.
అది కేవలం మా స్నేహానికి సంబంధించిందే కానీ..దీనికి పాలిటిక్స్‌కు ఎలాంటి సంబంధమే లేదని రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్లయితే స్వయంగా తానే వెల్లడిస్తానని అంతేకాదు.. ఏ పార్టీలో చేరుతానన్నది కూడా అప్పుడే అందరికీ చెబుతానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కేవలం తన పిల్లలు, ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నాంటూ రమ్యకృష్ణ(Ramya Krishna) చెప్పింది.