నిర్మాతకు దిమ్మతిరిగే షాకిచ్చిన వర్మ..
నిర్మాత నట్టికుమార్ కి రామ్ గోపాల్ వర్మ గట్టి షాకిచ్చాడు. కొన్ని రోజుల క్రితం వర్మ తనవద్ద డబ్బు తీసుకొనితిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు ఇచ్చేవరకు వర్మ సినిమా ‘డేంజరస్’ విడుదల ఆపాలని నిర్మాత కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. అయితే ఈ కేసుపై వర్మ మాట్లాడుతూ నట్టికుమార్ గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని, అతడు ఎప్పుడు ఇదే విధంగా చేస్తాడని చెప్పి మాట దాటేసిన వర్మ ఎట్టకేలకు అసలు నిజాలు ఇవి అంటూ ప్రూఫ్స్ తో సహా బయటపెట్టాడు. “తన ‘డేంజరస్’ సినిమాను ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ కుట్ర పన్ని ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ తో రిలీజ్ ను అడ్డుకున్నారని తెలుపుతూ వర్మ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు.
మీడియాలో నా పై నిందలు వేసిన నట్టి కుమార్ మీద , అతని కొడుకు, కూతురు మీద.. నేను, తుమ్మలపల్లి రామత్యనారాయణగారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ డాక్యుమెంట్‌ని ఉపయోగించి సినిమాని ఆపి, మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వాళ్ల మీద డ్యామేజ్ కేసు వెయ్యబోతున్నాము. క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక ‘డేంజరస్’ చిత్రాన్ని మే 6 న రిలీజ్ చేయబోతున్నాం. దానికి సంబంధించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నాము. ఇక ఈ విషయంపై ఇంకా ఏమీ మాట్లాడను. జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యల కోసం దృష్టి పెడతాను. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయటపడబోతోంది” అని తెలిపాడు.