Ramcharan: మాకంటూ సొంత గుర్తింపు రావాలని నాన్న ఆరాటపడ్డాడు.. రామ్ చరణ్
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడుఇండియన్ సినిమాకి మాత్రమే పరిమితం కాదు. అతడో గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ మూవీతో చెర్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీ రామ్ పాత్రలో ఇరగదీసిన అతడు.. పాన్ ఇండియా కాదు కదా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. రామ్ చరణ్,ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఒరిజినల్ విభాగంలో ఆస్కార్ కి ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్‌చరణ్ అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు చేరుకున్నారు. అక్కడ వరుసగా మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో టాక్ ఈజీ పాడ్‌క్యాస్ట్‌లో హోస్ట్ సామ్ ఫ్రాగోసోతో మాట్లాడిన రామ్‌చరణ్ ఆసక్తి కర విషయాలను పంచుకున్నాడు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ నాటు నాటు ప్రజలందరూ మెచ్చిన పాట. భిన్న సంస్కృతులు, ఇతర రాష్టాలకు చెందిన వారు కూడా ఈ పాటను తమ పాటగా స్వీకరించారు. జపాన్ నుంచి అమెరికా వరకు ‘నాటు నాటు’ పాట ప్రతి ఒక్కరి హృదయాల్ని గెలుచుకుందన్నాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి చెబుతూ మురిసిపోయాడు. నాన్న మెగాస్టార్. అయితే ఆయన నీడలో మేం ఉండకూడదని మాకంటూ ఓ గుర్తింపు ఉండాలనే నాన్న ఆరాటపడేవారని అన్నారు. ఆయనకు వచ్చిన స్టార్‌డమ్‌ను బయట వదిలి ఇంట్లోకి వచ్చేవారని అన్నారు. దాన్ని మా దరిదాపుల్లోకి కూడా రానీయలేదన్నారు.
మమ్మల్ని ఒక స్టార్ కిడ్స్‌గా కాకుండా సాధారణ పిల్లలుగానే పెంచాడు. సినిమా ఇండస్ట్రీలోకి సులభంగా అడుగుపెట్టొచ్చన్న ఆలోచనను మాకు ఎన్నడూ రానీయలేదు. అందుకే చిన్నప్పుడు షూటింగ్స్ కి తీసుకెళ్లేవారు ఆయన ఎంతకష్టపడుతున్నారో అని మాకు తెలియచెప్పేవారు. అలాంటి కష్టముంటేనే సొంతంగా పైకిరాగాలుగుతామని చెప్పకనే చెప్తాడు. ఆయనకు వచ్చిన ఒక్క అవార్డును కూడా ఇంట్లో పెట్టుకోలేదు..ఇంటికింద ఉండే ఆఫీస్ లోమాత్రమే అవార్డ్స్ ఉంటాయని అన్నారు.