Ram Gopal Varma: ఒక్కప్పుడు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించే వర్మ ప్రస్తుతం ప్లాఫ్ చిత్రాలను తీస్తున్నాడు. అయినా కూడా వర్మ చిత్రాలకున్న క్రేజే వేరు. బయోపిక్ లు తీయడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. ఈమధ్యనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు ఆతర్వాత ‘వ్యూహం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. తాజాగా రాంగోపాల్ వర్మ ఈడీ కేసులో విచారణను ఎదుర్కొన్న చికోటి ప్రవీణ్ ను కలిసాడు.
త్వరలోనే చికోటిపై సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కన్పిస్తోంది.
ఇందులో భాగంగానే ఆర్జీవీ చికోటి ని కలిసి చర్చించినట్లు వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తన ఫామ్ హౌస్ లోని అన్యదేశ జంతువుల సేకరణను తిలకించారువర్మ. అనంతరం కొద్దిసేపు చీకోటి ప్రవీణ్ తో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఆర్జీవీ స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల క్యాసినో.. హవాలా రూపంలో డబ్బుల పంపిణీకి సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు చీకటి ప్రవీణ్ ను విచారించారు. ప్రవీణ్ కి రాజకీయ నాయకులు సెలబ్రటీలతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. తాజాగా ఆర్జీవీ చికోటిని కలవడంతో చికోటి బయోగ్రఫీపై ఆర్జీవీ సినిమా చేయబోతున్నారా అనే టాక్ నడుస్తోంది.
Chikoti Praveen showing off his beautiful OSTRICH ..THEY LOVE EACH OTHER 💪💪💪 Never seen a man who’s more passionate about wild animals than CHIKOTI PRAVEEN 👌 pic.twitter.com/pZjgojtHI1
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022
Sitting with the WILD MAN Chikoti Praveen at his WILD farm house ..His collection of EXOTIC WILD ANIMALS is super IMPRESSIVE 💐 pic.twitter.com/5ylet1MQQF
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022
On the whole had a FANTASTIC time with Chikoti Praveen and his EXOTIC WILD ANIMALS 😍😍😍 pic.twitter.com/XlkhN0fgVn
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022