Ram Charan Dress: రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం!
Ram Charan Dress: ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వాడి సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. ఆస్కార్ అవార్డు కూడా అందుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా ఆ ఈవెంట్ కు ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ లోని ముఖ్యమైన వారు లాస్ ఏంజిల్స్ కు వెళ్లి ఆ ఈవెంట్ లో సందడి చేశారు. ముఖ్యంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్రెస్సింగ్ చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్ సూట్లో పోష్ గా కనిపించగా చరణ్ మాత్రం భారతీయత కొట్టొచ్చే విధంగా డ్రెస్ ధరించాడు.
ఆ డ్రెస్సు ఇప్పుడు ఆయనకు మరో ఘనత తెచ్చిపెట్టింది. ఆ డ్రెస్సింగ్ వలన రామ్ చరణ్ ఎస్క్వైర్ బెస్ట్ డ్రెస్స్డ్ మెన్ 2023 టాప్ టెన్ లిస్ట్ లో నిలిచాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో ఈ రేసులో నిలబడలేదు. తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన బ్లాక్ షేర్వాణీని రామ్ చరణ్ ధరించారు. ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ నికితా జైసింఘని చరణ్ ను అలా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. చివరి నిమిషం వరకు చరణ్ ఫైనల్ లుక్ ఫైనల్ కాకపోయినా చివరి నిముషంలో ఆ డ్రెస్ ఫైనల్ చేసి మరో ఘనత సాధించేలా చేశారు.