Ramcharan: ఆయన బయోపిక్ లో నటించాలనుంది..రాంచరణ్
Ramcharan: ఇండియన్ క్రికెటర్స్ పై మనం చాలానే బయోపిక్ లు చూసుంటాం. సచిన్ ,ధోని, కపిల్ దేవ్ వంటి భారత క్రికెటర్లపై బయోపిక్ సినిమాలురాగా ..మరో సినిమా రాబోతుందని సమాచారం. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఇది కేవలం వార్తనే.. నిర్మాత దొరికితే మాత్రం పట్టాలెక్కనుంది..ఇది రామ్ చరణ్ మనసులో మాట.
కోహ్లీ పై బయోపిక్ తీస్తే, ఆ సినిమాలో నటిస్తానని రాంచరణ్ అన్నాడు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రామ్‌చరణ్ పాల్గొన్నాడు. ఆ సమయంలో హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిస్తూ స్పోర్ట్స్ బేసెడ్ సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తోన్నానని అన్నాడు. కానీ ఆ కోరిక మాత్రం తీర లేదని రామ్‌చరణ్ చెప్పాడు. విరాట్ కోహ్లి బయోపిక్‌పై అడిగిన ప్రశ్నకు రామ్‌చరణ్ బదులిస్తూ ఛాన్స్ దొరికితే తప్పకుండా కోహ్లి బయోపిక్‌లో నటిస్తానని అన్నాడు. లుక్ పరంగా తాను కొంత కోహ్లికి దగ్గరగా కనిపిస్తానని చరణ్ అన్నాడు. కోహ్లీ అద్భుతమైన వ్యక్తి , క్రికెటర్ అని ఒకవేళ ఛాన్స్ వస్తే కచ్చితంగా ఆయన బయోపిక్ లో నటిస్తానని తెలిపాడు.