Ram Charan: మరువలేని క్షణాలు- రాం చరణ్
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ యు.ఎస్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవలే ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో లో పాల్గొన్న రామ్ చరణ్ ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు. యు.ఎస్‌లో ఇప్పుడందరూ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్లోని పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ రామ్ చరణ్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది.
లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రామ్ చరణ్‌తో మాట్లాడుతూ ఆస్కార్ నామినేషన్స్ గురించి, ప్రస్తుతం అతని ఆలోచనా విధానంపై ప్రత్యేకంగా తెలిపాడు. అదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR చేయబోతున్న లైవ్ పెర్ఫామెన్స్ గురించి ‘నాటు నాటు..’ సాంగ్ తెరకెక్కించేటప్పుడు కలిగిన ఎక్స్‌పీరియెన్స్ గురించి రామ్ చరణ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘నాటు నాటు’ సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు రావటం..అలాగే ఆస్కార్‌కి ఎంపిక కావటం ఎలా అనిపిస్తుంది. అని ప్రశ్నించగా.. చరణ్ స్పందిస్తూ.. నా జీవితంలో ఇవి అద్భుతమైన క్షణాలు. ఆస్కార్ వేడుకల్లో నేను ఓ అతిథిగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నామినేట్ అయ్యాను. నేను ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లటానికి చాలా ఎగ్జయిట్మెంట్‌తో ఎదురు చుస్తునాననిఅన్నారు. మార్చి 3న మా సినిమా యు.ఎస్‌లో రీ రిలీజ్ అవుతుంది. కచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదని భావిస్తున్నాను అని తెలిపాడు.