బాబాయ్ తో అబ్బాయ్.. కన్ఫర్మ్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఫేవరేట్ హీరోల కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యామిలీ నుంచి ‘ఆచార్య’తో చిరు, చరణ్ ల మల్టీస్టారర్ వస్తున్న సంగతి విదితమే. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29, 2022 న గ్రాండ్ థియేట్రికల్‌గా విడుదల కానుంది. మెగా పవర్‌స్టార్ ప్రెస్ మీట్ సందర్భంగా తన బాబాయ్, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తానని వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి చేయనున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని, ఆ మల్టీస్టారర్ సినిమాను తానే నిర్మిస్తానని చరణ్ కన్ఫర్మ్ చేశాడు. ఇక ఈ వార్తతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.