OTT Updates: రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఛత్రీవాలా ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
Rakul Preet Singh Chhatriwali movie will be streamed on ZEE 5 Plat form
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఛత్రీవాలా సినిమా జనవరి 20న థియేటర్లలో విడుదల అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ 5 సంస్థ దక్కించుకుంది. ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందనే విషయం ఇంకా వెల్లడికాలేదు.
రకుల్ ప్రీత్ ప్రధాన పాత్రలో నటించిన ఛత్రీవాలా సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు. సినిమాలో నటీనటుల ప్రదర్శన చాలా బాగుందని ప్రశంసించాడు. సినిమా సంభాషణల విషయంలో కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ట్వీట్ చేశాడు.
సెక్స్ ఎడ్యుకేషన్ వచ్చే సినిమాలు మన దేశంలో చాలా తక్కువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ సాహసం చేసి ఈ సినిమాలో నటించింది. సేఫ్ సెక్స్, కండోమ్ వాడకం గురించి కూడా సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
RAKUL PREET SINGH: ‘CHHATRIWALI’ PREMIERES ON ZEE5…Winning accolades for its writing and performances… #Chhatriwali – starring #RakulPreetSingh – is streaming on #Zee5… Watch it now only on #ZEE5.#ChhatriwaliOnZEE5. pic.twitter.com/PpnURf2Sph
— taran adarsh (@taran_adarsh) January 20, 2023