Akshay Kumar: ఫ్యామిలీ ఎమోషన్స్ అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’
Raksha Bandhan Trailer: కొన్నేళ్లుగా బాలీవుడ్ కి ఏమి కలిసిరావడంలేదు కథల ప్రభావమో లేక సినిమాను తెరకెక్కించడంలో విఫలమో గానిఈమధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. కంగనా నటించిన ధాకడ్ చిత్రం దారుణ మైనఫలితాన్ని చవిచూసింది.అక్షయ్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రం కూడా ప్రేక్షకులులేక షోస్ రద్దు చేసారు.బాలీవుడ్ లో ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో గుండెలు అరచేతుల్లో పెట్టుకుని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.
బాక్సాఫీస్ ను షేక్ చేసే అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం చవిచూడటం, గత కొన్ని నెలల్లో వచ్చిన మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల తిరస్కరణకు గురి కావడంతో ప్రస్తుత రాబోయే సినిమాల విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు.తాజాగా అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ ట్రైలర్ ను విడుదల చేసింది యూనిట్.
ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైనర్లు చేసే అక్షయ్.. ఈసారి ఎంటర్టైన్మెంట్ ప్లస్ సెంటిమెంటుతో వస్తున్నాడు. ఒక అన్నయ్య, నలుగురు సిస్టర్స్ స్టోరీ ఇది. సినిమాలో అక్షయ్ చిన్న వ్యాపారం చేస్తుంటాడు . తన నలుగురు చెల్లెళ్లకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడమే అతడి లక్ష్యం. కానీ ఆ నలుగురు ఒక్కో రకం. అన్నయ్యకి చుక్కలు చూపిస్తుంటారు. నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కోసం ఓ అన్న పడే తంటాల నేపథ్యంలో నడిచే సినిమా ఇది. మరోపక్క హీరోయిన్ భూమి పెడ్నేకర్ అక్షయ్ తో పెళ్లి ఎప్పుడు జరుగుతుందా..? అని ఎదురుచూస్తుంటుంది. అతడు మాత్రం చెల్లెళ్ల పెళ్లిళ్లు అయిన తరువాతే తాను పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని ఉంటాడు . ఈనేపథ్యంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే సినిమా కథ. ఆగస్టు 11న రక్షాబంధన్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ సినిమా.
మొత్తంగా చూస్తే కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా బాగానే దట్టించినట్లున్నారు. చిత్రానికి రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక ధిల్లాన్ రచన చేయడం విశేషం.