Rakhi Sawant: రాఖీ సావంత్ అరెస్ట్.. ఏమైందంటే?
Rakhi Sawant arrested: వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఖీ గురించిన ఈ సమాచారాన్ని షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలం క్రితం షెర్లిన్ చోప్రా రాఖీ సావంత్‌పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో, ఈ కేసులో చర్యలు తీసుకుంటున్న పోలీసులు రాఖీని అదుపులోకి తీసుకున్నారని షెర్లిన్ చోప్రా ట్వీట్ చేసింది. జనవరి 19న, షెర్లిన్ చోప్రా ట్వీట్ చేస్తూ, ‘బ్రేకింగ్ న్యూస్ అంబోలి పోలీసులు FIR 883/2022కి సంబంధించి రాఖీ సావంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాఖీ సావంత్ యొక్క ABA 1870/2022 ను ముంబై సెషన్స్ కోర్టు నిన్న కొట్టివేసింది అని ఆమె పేర్కొన్నారు.
తాను నవంబర్ 9న రాఖీపై ఫిర్యాదు చేశానని సాజిద్ ఖాన్ – రాజ్ కుంద్రా మధ్య జరుగుతున్న పోరాటంలో రాఖీ జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు, అలాగే ఆమె నా సన్నిహిత చిత్రాలను మీడియా ముందు మరియు బహిరంగంగా షేర్ చేసి నేను వ్యభిచారంలో ఉన్నానని చెప్పింది, ఆమె చేసిన చౌకబారు ఆరోపణ వల్లే పరువు నష్టం కేసు వేశానని షెర్లిన్ పేర్కొంది. నిన్న ఆమె బెయిల్ తిరస్కరించబడింది, ఈరోజు ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె నాతో పాటు పోలీస్ స్టేషన్‌లోనే ఉంది, ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. బిగ్ బాస్ 16 ప్రారంభమైన తర్వాత, షెర్లిన్ చోప్రా సాజిద్ ఖాన్‌పై మేకర్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. సాజిద్ ఖాన్ ఎంతో మంది అమ్మాయిలను దోపిడీ చేసిన వ్యక్తి అని షెర్లిన్ అన్నారు. షోలో పాల్గొనే హక్కు అతనికి లేదని చెబుతూ షెర్లిన్ సాజిద్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాఖీ సావంత్ సాజిద్ ఖాన్‌ను తన సోదరుడిగా భావిస్తుంది. అందుకే షెర్లిన్ ఆరోపణలను పూర్తిగా తప్పు అని ఆమె ఆరోపించింది.