Rajinikanth:తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టులో విడుదలై వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
Rajinikanth:సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టులో విడుదలై వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. కొంత కాలంగా రజనీ మార్కు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు కరెక్ట్ సినిమా పడటంతో `జైలర్`కు బాక్సాఫీస్ వద్ద అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయి వసూళ్లని కట్టబెట్టారు. ఇప్పటి వరకు దాదాపుగా `జైలర్` రూ.600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
రజనీ నటించిన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది. `2.0` తొలి స్థానాన్ని దక్కించుకోగా `జైలర్` రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో `పొన్నియిన్ సెల్వన్ 1`, సొన్నియిన్ సెల్వన్ 2` చిత్రాలు నిలిచాయి. ఇదిలా ఉంటే ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో ఈ మూవీ సక్సెస్‌ని మేకర్స్ భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్నారు. రజనీకి మరో వంద కోట్ల చెక్‌ను అందించడమే కాకుండా అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా అందజేశారు.
రజనీ తరహాలోనే దర్శకుడు నెల్సన్‌కు, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కూడా కాస్ట్లీ కార్లని అందించిన మేకర్స్ తాజాగా భారీ స్థాయిలో `జైలర్` సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రజనీతో పాటు టీమ్ అంతా పాల్గొంది. అయితే ఈ వేదికగా రజకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పడు నెట్టింట వివాదంగా మారుతోంది. సక్సెస్ మీట్ లో పాల్గొన్న రజనీ `జైలర్` సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటికి రీ రికార్డింగ్ పూర్త ఇకాలేదని, ఫస్ట్ కట్ చూసి తాను ఎబౌ యావరేజ్ అనుకున్నారట. నెల్సన్ ఫ్రెండ్ మాత్రం అదిరిపోయింది అన్నారట. కానీ రజనీ మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదట.
ఎవరెన్ని చెప్పినా రజనీ మాత్రం `జైలర్` సినిమా ఎబౌయావరేజ్ అనుకున్నారట. అంతే కాకుండా అనిరుధ్ వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని, లేదంటే ఎబౌ యావరేజ్ మాత్రమే అని రజనీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. `జైలర్` ఆడియో రిలీజ్ ఫంక్షన్లో `బీస్ట్` ఫ్లాప్ అని చెప్పి షాక్ ఇచ్చిన రజనీ తాజాగా అనిరుధ్ లేకపోతే ఎబౌయావరేజ్ అనడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. రజనీ దర్శకుడిని కించపరుస్తున్నారని వాపోతున్నారు. దీంతో రజనీ ఇచ్చిన స్టేట్మెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Then : Spoke about Beast negative reviews in Audio Launch In front of Nelson
Now : Telling that #Jailer is an average movie without Anirudh in front of Nelson.
Don't you have shame @rajinikanth ?🫠 pic.twitter.com/lEGi835NoC
— 🥶. (@KuskithalaV6) September 18, 2023