Rajanikanth: బాబుతో నిన్న పవన్ నేడు రజనీ భేటీ!
Rajanikanth Meets Chandrababu: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా షూటింగ్ నిమిత్తం హైదరబాద్ వచ్చిన ఆయన షూట్ అయ్యాక వచ్చి చంద్రబాబును కలిసినట్టుగా తెలుస్తోంది. గతంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి మూసేసిన రజనీకాంత్ ఇప్పుడు కొంత బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అలాంటి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబును కలవడం చర్చనీయంశంగా మారింది.
రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న జైలర్ సినిమాలో రమ్యకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలలో కనిపించానునారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ జైలర్ సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తవగా మిగతా చిత్రీకరణ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది.
రజనీకాంత్‌కు సంబంధించిన ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. ఇక ఈ జైలర్ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక జైలర్ సినిమాలో పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో మోహన్ లాల్ కనిపించనుండగా ఆయన కూడా జైలు సెట్ లోనే షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ సినిమాను కళానిధి మారన్‌కి చెందిన సన్ ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.