Rajamouli: ఆపాటకు అదే సరైన ప్లేస్.. రాజమౌళి
Rajamouli: తెలుగు సినీ ప్రేక్షకులు టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగాడు అంతేకాకుండా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించాయి.
గత ఏడాది రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ బరిలో ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం పలు అవార్డులు దక్కించుకుంది. మార్చి 12 న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం లాస్ ఏంజిల్స్ కి చేరుకుంది. తాజాగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాటు నాటు పాటగురించి కొన్ని విషయాలు తెలిపాడు జక్కన.
నాటు నాటు షూటింగ్ ఇండియాలో మొదలుపెట్టే సమయానికి మన దగ్గర వర్షాకాలం వచ్చేసింది. అలాంటి పరిస్థితులతో సెట్ వేస్తే అంతా పాడవుతుంది. ఆ పాటను ఉన్నత స్థాయితో చిత్రీకరించాలనుకున్నాం.. మా ఆలోచనలకు తగ్గట్టు ఉన్న బిల్డింగ్ కోసం వెతికాం ఉక్రెయిన్ లోని ప్రెసిడెంన్షియల్ బిల్డింగ్ సరైంది అనిపించింది. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి అడిగిన వెంటనే పరిమిషన్ ఇచ్చిన ఉక్రెయిన్ టీంకు మా ధన్యవాదాలు అని తెలిపాడు. మాకు కావాల్సినట్టు ప్యాలెస్ రంగులు, కొన్ని రూపురేఖలు మార్చారు. అందువల్ల మేము అనుకున్న స్థాయి కంటే నాటు నాటు పాట ఈ రేంజ్ లో సక్సెస్ అయిందన్నాడు.