Rajamouli Meets Spielberg: ఈరోజు నా దేవుణ్ణి కలిసాను..రాజమౌళి
Rajamouli Meets Steven Spielberg: ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతటా అత్యధిక వసూళ్ళని కొల్లగొట్టింది. దాదాపుగా 1200 కోట్లు వసూళ్లుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది ‘ఆర్ ఆర్ ఆర్’.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. నాటునాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. కాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు.
ఇక జక్కన్నను అమెరికా లో పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు సినిమాను ఎల్లలు దాటించిన దర్శకదీరుడంటూ పొగిడేశారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ ని దర్శకధీరుడు రాజమౌళి కలిసారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కుటుంబ సమేతంగా అమెరికాకి వెళ్లిన రాజమౌళి ఆయన్ని కలిశారు.
ఇక స్పిల్ బర్గ్ తో కలిసి కలిసి దిగిన పలు ఫోటోలను రాజమౌళి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ముఖ్యంగా ‘నేను దేవుడిని ఇప్పుడే కలిశాను’ అంటూ తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. గాడ్ ఆఫ్ మూవీస్ గా అభివర్ణించే స్పిల్ బర్గ్ ని కలిసి.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో చెప్పాను. నాటు నాటు ఎంతో నచ్చిందని ఆయన చెప్పిన మాటలను నేనింకా నమ్మలేకపోతున్నాను అని కీరవాణి అన్నారు.
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023