Rajamouli: నెటిజన్ డౌట్ ను క్లారిటి చేసిన జక్కన్న
Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఎస్.ఎస్. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది. పలు విజయవంతమైన సినిమాలు తీసిన రాజమౌళి ఎంతోమందికి సుపరిచితమే. మరోకొద్దీ గంటల్లో ఈ దర్శక దీరుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్ ను అందుకోబోతున్నాడు. ఈ సమయంలో రాజమౌళికి మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది.
కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమితులయ్యారు. రాయచూర్ కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. కర్ణాటకలో మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఈ బాధ్యతలు తీసుకోవడం కీలకంగా మారింది. రాయచూర్ జిల్లాకు రాజమౌళిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించింది. జిల్లాలోని ఓటర్లలందరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా రాజమౌళి అవగాహన కల్పిస్తారని ఈసీ వెల్లడించింది.
రాయచూర్ జిల్లాకు రాజమౌళిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించడంతో కొందరికి ఎక్కడలేని అనుమానాలు కలుగుతున్నాయి. అందులో కొందరు చర్చించుకుంటుంటే. మరికొందరు గూగుల్ లొ సర్చ్ చేయడం మొదలుపెట్టారు. మరికొందరు రాజమౌళికి ట్విట్స్ చేస్తున్నారు. ఇందులో ఓ నెటిజన్ రాజమౌళిని ఓ ప్రశ్న వేసాడు. మా ఫ్రెండ్స్ అందరికి డౌట్ ఉంది నిజంగా మీ బర్త్ ప్లేస్ ఎక్కడ అని అడిగారు. దీనికి రాజమౌలి సమాధానమిస్తూ. నేను కర్ణాటక రాష్టంలో రాయచూరు జిల్లా అమరేశ్వరి క్యాంప్ లో జన్మించానని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడింది.