Rahul Sipligunj: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj: యూట్యూబ్ వీడియోల నుంచి మొదలైన రాహుల్ విజయ భేరి.. ఆ తర్వాత సినిమా పాటలు, బిగ్‌బాస్ తెలుగులో టైటిల్ విన్నర్‌గా విజయం. ఇప్పుడు ఏకంగా తాను పాడిన పాటకు ఆస్కార్ రావడం.. ఎంతో గర్వాంగా ఉందన్నారు. అంతర్జాతీయ ఆస్కార్ వేదిక పై తనపాటను వినిపించి తెలుగు ప్రజలకు మంచి మెమొరబుల్ ట్రీట్ ను ఇచ్చాడు.
ఆస్కార్ ఆవార్డ్ తర్వాత హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ అభిమానుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ ..నేను ఇంతటి స్థాయికి రావడానికి ముఖ్యకారణం నా అమ్మ నాన్న అలాగే నన్నుప్రేమించే అభిమానుల వల్ల ఈ స్థాయికి రాగలిగానని తెలిపాడు. ఈ అవార్డు రావడం తో మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. అలాగే ఈ నాటు నాటు పాటను పాడడానికి ఛాన్స్ ఇచ్చిన కీరవాణిగారికి ,రాజమౌళి కి ధన్యవాదాలు తెలిపాడు.