Raghava Lawrence:హారర్ థ్రిల్లర్ సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. దర్శకుడిగా, హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర దర్శకులు తెరకెక్కించే చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా మూవీ `చంద్రముఖి 2`. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు.
Raghava Lawrence:హారర్ థ్రిల్లర్ సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. దర్శకుడిగా, హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర దర్శకులు తెరకెక్కించే చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా మూవీ `చంద్రముఖి 2`. పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. సెప్టెంబర్ 15న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
2005లో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో నటుడు ప్రభు శివాజీ గణేషన్ ప్రొడక్షన్స్‌పై నిర్మించి `చంద్రముఖి` అప్పట్లో ఏ స్థాయి సంచలనాలని సృష్టించిందో అందరికి తెలిసిందే. రజనీకాంత్ కెరీర్‌ని మరో మలుపు తిప్పిన ఈ సినిమాలో జ్యోతిక టైటిల్ పాత్రలో నటించగా, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రస్తుతం `చంద్రముఖి 2`ని రాఘవ లారెన్స్, కంగన రనౌత్ జంటగా రూపొందించారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది.
మరో ఇరవై రోజుల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. ఇందులో భాగంగానే ఆడియో రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌన్సర్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనిపై స్పందించిన లారెన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఈవెంట్ కోసం వచ్చిన కాలేజీ స్టూడెంట్‌పై ఓ బౌన్సర్ దాడి చేయడాన్ని లారెన్స్ తప్పు పట్టారు. వ్యక్తిగతంగా తనకు గొడవలు నచ్చవన్నారు.
`చంద్రముఖి 2` ఆడియో విడుదల సందర్భంగా ఓ బౌన్సర్‌కు, కాలేజీ స్టూడెంట్‌కు మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. వేడుక జరుగుతున్న సమయంలో హాల్ బయట ఈ సంఘటన చోటు చేసుకోవడంతో నాకు కానీ, ఈ వేడుక నిర్వాహకులకు కానీ విషయం తెలియలేదు. స్టూడెంట్స్ అంటే నాకు ఎంత ఇష్టమో, వాళ్లు జీవితంలో పైకి రావాలని ఎంతగా కోరుకుంటానో అందరికి తెలుసు. ఇలాంటి గొడవలకు నేను పూర్తిగా వ్యతిరేకిని. మనం వెళ్లే ప్రతి చోటు సంతోషం, శాంతితో కళకళలాడాలని కోరుకుంటా. కారణం ఏదైనా సరే ఒక వ్యక్తిని, మరీ ముఖ్యంగా ఓ స్టూడెంట్‌ని కొట్టడం తప్పు. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది. ఇందుకు నేను క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఇలాంటి దాడులకు పాల్పడవద్దని బౌన్సర్లకు విజ్ఞప్తి చేస్తున్నా` అని రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.