Chandramukhi 2: ‘చంద్రముఖి 2 ‘ లో అంతమంది హీరోయిన్లా
Raghava Lawrence to romance five heroines in Chandramukhi 2 : తమిళంలో సక్సస్ ఫుల్ చిత్రాలను అందించిన దర్శకుడు పి వాసు. ఆయన దర్శకత్వంలో రజినీకాంత్ 2005లో ‘చంద్రముఖి’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో జ్యోతిక నటన సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు సైకియాట్రిస్ట్ పాత్రలో రజనీకాంత్ నటించగా ప్రభు,నయన తార,వడివేలు,విజయ్ తదితరులు నటించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో.. తెరకెక్కిన ‘చంద్రముఖి’ అప్పట్లో విడుదలైన అన్ని భాషలలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాని రాఘవ లారెన్స్ హీరోగా..పి. వాసు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ ప్రారంభం కాకముందు లారెన్స్ రజినీకాంత్ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.
‘చంద్రముఖి 2’ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నీ ఎంపిక చేయడం జరిగిందని సమాచారం. ఆ ఐదుగురిలో నంబిరాయర్ ఒక హీరోయిన్ అని తెలుస్తుంది. ప్రస్తుతం నంబిరాయర్ మైసూర్ లో జరుగుతున్న షూటింగ్ లో జాయిన్ అయింది. ఇక ఈ సినిమాలో హాస్యనటుడు వడివేలు.. కూడా కీలక పాత్రలో నటిస్తున్నారట. గతంలో లారెన్స్ నుంచి వచ్చిన కామెడి హర్రర్ చిత్రాలు ముని, కాంచన, కాంచన 2, గంగ, కాంచన 3 సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.
దాదాపు 17 సంవత్సరాల తర్వాత ‘చంద్రముఖి’ కి సీక్వెల్ వస్తూ ఉండటంతో ప్రేక్షకులలో ఒక క్రురియాసిటి మొదలైంది. వాస్తవానికి పి. వాసు గతంలోనే రజినీకాంత్ తో ఈ సీక్వెల్ చేయాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందట కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. ఇప్పుడు లారెన్స్ తో సీక్వెల్ చేస్తున్నాడు దర్శకుడు వాసు.