Ragavendrarao:విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేన్ని విడుదల చేసింది. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
Ragavendrarao:విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేన్ని విడుదల చేసింది. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు మూడు తరాల వారసులు పాల్గొని సందడి చేశారు. కేంద్రం విడుదల చేసిన ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఇండియన్ గవర్నమెంట్ వెబ్ సైట్లో లేదా హైదరాబాద్‌లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ విక్రయ కౌంటర్లలో నేరుగా పొందవచ్చు. ఇదిలా ఉంటే కేంద్రం ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణేన్ని విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సందర్భంగా కొత్త డిమాండ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవం, దివంగత నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని కూడా విడుదల చేశారు. `నాకు దైవ సమానులైన నందమూరి తారాక రామారావు పేరుతో భారత ప్రభుత్వం రూ.100 కైన్ విడుదల చేసిన సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఆయనకు భారత రత్న బిరుదు కూడా భారత ప్రభుత్వం ఇస్తే తెలుగు జాతి నిజంగా గర్వించదగిన రోజు అవుతుంది. ఆ పని కూడా త్వరగా అందరూ పూనుకుని చేస్తారని నమ్ముతూ మీ రాఘవేంద్రరావు` అంటూ వీడియో విడుదల చేశారు. దీనికి #bharatrathna #ntr అంటూ హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
We Demand Bharat Ratna for NTR Garu#bharatrathna #ntr pic.twitter.com/r9k06SGSvL
— Raghavendra Rao K (@Ragavendraraoba) August 29, 2023