డిజిటల్ ప్రీమియర్ గా రాధేశ్యామ్.. అధికారికంగా తెలిపిన మేకర్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్… ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న రిలీజ్ అయినా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇక థియేటర్లో మెప్పించలేని ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1 వ తేదీ నుండి ప్రసారం కానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు లో మాత్రమే కాకుండా, మిగతా బాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేని ఈ సినిమా కనీసం ఓటిటీలోనైనా తన సత్తా చాటుతుందేమో చూడాలి.