RamCharan: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ ?
Ram Charan Gowtham Tinnanuri film: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘RRR’ సినిమాతో సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రామరాజు గా చరణ్ నటన అందరిని మెప్పించింది.పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ పరిణామంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రామ్ చరణ్ మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘RC15’ సినిమా చేస్తూన్నాడు.ఈ చిత్రానికి ఆఫీసర్,అధికారి అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ శెరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే శంకర్ సినిమా కంప్లీట్ అవ్వకముందే నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. ‘జెర్సీ’ మూవీ డైరెక్టర్ గౌతం తిననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రాజెక్ట్ తెరపైకి తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ తిన్న నూరి ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసాడని టాక్ నడుస్తుంది.
దీంతో శంకర్ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం.ఈ సినిమా కూడా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు శంకర్ సినిమాకి సంబంధించి టైటిల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారంట.అలాగే గౌతమ్ సినిమా ప్రాజెక్ట్ ను కూడా రివీల్ చేయనున్నారని సమాచారం.