మెగాస్టార్ కోసం నటుడిగా మారిన పూరి… కలలా మిగిపోకూడదు అంటూ!
తెలుగు సినీ పరిశ్రమలో పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన మార్క్ సినిమాలతో తెలుగులో అద్భుతమైన విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న క్రమంలో ఇప్పటికే జనగణమన అంటూ మరో సినిమాను కూడా విజయ్ దేవరకొండతో ప్రకటించాడు. అయితే ఇంతటి విజయవంతమైన దర్శకుడు నిజానికి మొదట నటుడు కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాడట. ఈ విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ అనే సినిమాలో పూరి జగన్నాథ్ ఒక అతిథి పాత్రలో చేస్తున్నారు ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ ని నటుడిని చేస్తున్నామని అంటూ ఆసక్తికరంగా ప్రకటించారు. ” నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే పూరీ జగన్ ను మా గాడ్ ఫాదర్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ద్వారా పరిచయం చేస్తున్నాం అంటూ ఆయనతో ఉన్న పిక్ షేర్ చేశారు.మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.