లైగర్ వివాదం కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతుంది. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ఎంతటి పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
లైగర్ వివాదం కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతుంది. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ఎంతటి పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా ఎంతోమంది ఎగ్జిబిటర్లకు కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని గతేడాది నుంచి ఎగ్జిబిటర్లు.. పూరి జగన్నాథ్ ను వేడుకుంటూనే ఉన్నారు. ఇక లైగర్ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వలన తాము రోడ్డున పడ్డామని, తమ గోడును పూరి- ఛార్మి పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. సుమారు 9 కోట్ల రూపాయలకు పైగా తమకి నష్టాలు వచ్చాయని, పూరీజగన్నాధ్ ఆదుకుంటానని హామీ ఇచ్చి మర్చిపోయారని నిరసన తెలియజేశారు
తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకున్నారు. ఇక ఈ దీక్షపై తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు మురళీమోహన్, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ రెడ్డి స్పందించారు. తాము.. సినిమా నిర్మాతలతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతామని తెలిపారు. ఇక నిర్మాత మండలి మరియు తెలంగాణ ఛాంబర్ అఫ్ కామర్స్.. ఈ సమస్యని సామరస్యంగా సాల్వ్ చేస్తామని మాట ఇవ్వడం వలనే దీక్ష విరమిస్తున్నట్లు ఎగ్జిబిటర్లు వెల్లడించారు. మరి ఈ సమస్యను సినీ పెద్దలు సాల్వ్ చేస్తారా..? లేదా..? అనేది చూడాలి.