Dil Raju : కొడుకుకి నామకరణం చేసిన బడా నిర్మాత
Dil Raju Named his Son as Anvy Reddy: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ఇండస్టీ మొత్తం తెలుసు. దిల్ రాజు మొదటి భార్య చనిపోయిన తర్వాత 2020లో ఈయన వైఘా రెడ్డి (తేజస్వి)ని రెండో వివాహం చేసుకున్నాడు. నిజామాబాద్‌లోని తన ఫామ్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజు.. ఇటీవల మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడని, టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
ఇకపోతే తాజాగా తనయుడికి దిల్ రాజు నామకరణం చేశాడు. అన్వయ్ రెడ్డి గా పేరు పెట్టాడని సమాచారం.ఈ పేరును పరిశీలించే క్రమంలో దిల్‌రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ పేరు వెనక కథ ఏంటంటే.. దిల్ రాజు తన ఇద్దరు భార్యల పేర్లు కలిసేలా కొడుకుకి పేరు పెట్టారట. ఆయన మొదటి భార్య పేరు అనిత. రెండో భార్య పేరు తేజస్వి కాగా.. పెళ్లికి ముందు వైఘా రెడ్డి అని మార్చారు.అలా ఇద్దరి పేర్లు వచ్చేలా ‘అన్వయ్’ గా కుమారుడికి నామకరణం చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చింది.