10 మంది హీరోయిన్లతో ప్రశాంత్ వర్మ సినిమా..?
అ! చిత్రంతో ప్రయోగాలకు తెరలేపిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ప్రయోగాలతో టాలీవుడ్ మూవీ సైంటిస్ట్ గా పేరుతెచ్చుకున్న ఈ డైరెక్టర్ మరో ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొట్ట మొదటి జాంబీ ను తెలుగువారికి పరిచయం చేసిన ఇతను ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ సూపర్ మ్యాన్ మూవీని చేస్తున్నాడు. ఇక దీని తర్వాత మరో ప్రయోగాత్మక సినిమా కథను సిద్దం చేసుకున్నాడట.
ఆ కథ కోసం ఆయనకు ఏకంగా పది మంది హీరోయిన్స్ కావాలని, చిన్నా పెద్ద హీరోయిన్స్ కలయికలో ఆ సినిమాను తీస్తానంటూ సన్నిహితుల వద్ద దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతున్నట్లు సమాచారం. ఒక్క సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే పాత్ర ఎక్కువ, తక్కువ.. అని గొడవలు పడుతూ డైరెక్టర్ కి టార్చర్ చూపిస్తారు. అలాంటిది ఏకంగా 10 మంది హీరోయిన్లను హ్యాండిల్ చేయడమంటే మాటలు కాదు. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒక వేళ నిజమైతే మొట్టమొదటి సారి 10 మంది హీరోయిన్లను ఒకేసారి డైరెక్ట్ చేసిన ఘనత ప్రశాంత్ వర్మకే చెందుతుంది.