Prabhudeva: ప్రభుదేవా ‘మై డియర్ భూతం’ నుండి మాస్టర్ సాంగ్ విడుదల
Prabhudeva My Dear Bootham :సినీ కెరీర్‌లో ప్రభు దేవా డాన్స్ కు ఉన్న క్రేజ్ మరెవరికి ఉండదు.డాన్సర్ గా కెరియర్ ప్రారంభించి.తెలుగు, తమిళ్, హిందీ,కన్నడ,అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ స్థానం ఏర్పరచుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లను టచ్ చేస్తూ ప్రేక్షకుల మెప్పుపొందాడు. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలో దాగి ఉన్న టాలెంట్ బయటపెట్టాడు.
ప్రేమికుడు తో మొదలైన నట ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభు దేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’.డిఫరెంట్ కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఈ మధ్య విడుదల చేసిన ప్రభుదేవా ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అల్లావుద్దీన్ అద్భుత దీపం లో మాంత్రికుని గెటప్ లో ప్రభుదేవా అందరిని మెస్మరైజ్ చేసాడు.ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నాడు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుందని సమాచారం.తాజాగా ఈ సినిమానుండి మాస్టర్ సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. ఇందులో ప్రభుదేవా స్టెప్స్ కి అందరు సెల్యూట్ చేస్తున్నారు.