Prabas : 2024 సంక్రాంతికి ప్రభాస్ సినిమా
Prabas Project K Release Date:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే ఒకటి. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈమద్యే అమితాబ్ పాత్రకు సంబందించిన సన్నివేశాలు హైదరాబాద్ లో చిత్రీకరించబడ్డాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాతో దీపికా పదుకొనె హీరోయిన్గా తెలుగులో అడుగెడుతుంది.
వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్‌ను నిర్మాత అశ్వినీదత్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 18 2023లో లేదా 2024 సంక్రాంతికి ప్రభాస్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. 2023 జనవరి వరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి …విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యమున్న సినిమా కాబట్టి ప్రీప్రొడక్షన్ కోసం దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల పాటు సమయం తీసుకోనున్నట్లు వెల్లడించాడు.
ఇక ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ,సందీప్ రెడ్డి తో స్పిరిట్ చిత్రాలతో పాటు మారుతీ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ఆది పురుష్ చిత్రం 2023 సంక్రాంతికి రిలీజ్‌కానుంది.