Prabhas Salaar: ప్రభాస్ ‘సలార్’ మూవీ క్రేజీ అప్ డేట్
Prabhas Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో సలార్ మూవీ ఒకటి. కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రభాస్ -ప్రశాంత్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
సలార్ ఎపిసోడ్స్ షూటింగ్ కోసం భారీ వ్యయంతో స్పెషల్ సెట్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోనున్నట్లు చెబుతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్‌ను పది రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ప్రభాస్‌కు ధీటుగా పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వారంలో ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ లో క్లైమాక్స్ కు చెందిన అత్యంత ఆసక్తికర సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయడానికి దర్శకుడు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.